e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News ఈ జైలు భోజ‌నం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాల‌ని అనుకుంటున్నారా?

ఈ జైలు భోజ‌నం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాల‌ని అనుకుంటున్నారా?

jail theme restaurant in Hyderabad | ఎవరైనా జైలుకు వెళ్లి తినాలనుకుంటారా ? ఊహల్లో కూడా జైలుకు వెళ్లడానికి, అందులో తినడానికి ఎవరూ అంగీకరించరు. కానీ నగరంలోని ఓ జైలుకు నిత్యం వందలాది మంది క్యూ కడుతున్నారు. ఆ జైలులో తినడానికి ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఆ జైలు ఏంటీ ? దాని కథ ఏంటీ అనుకుంటున్నారా? అయితే చలో… అమీర్‌పేట.

jail theme restaurant in Hyderabad

ఆహారప్రియుల అభిమతానికి అనుగుణంగా ‘గిస్మత్‌ జైలు’ వెలిసింది. ఇది పూర్తిగా జైలు థీమ్‌తో ఏర్పాటైన ఓ రెస్టారెంట్‌. ఆగస్టులో ప్రారంభమైన ఈ జైలు రెస్టారెంట్‌లో ప్రతీ రోజు 14వందల మంది ఖైదీ అవుతున్నారు. వెజ్‌, నాన్‌ వెజ్‌ మండీలు లభించే ఈ రెస్టారెంట్‌లో పూర్తి జైలు అనుభూతితో ఆహారప్రియులు నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్నారు.

jail theme restaurant in Hyderabad

నగరంలో నాలుగు..

- Advertisement -

గిస్మత్‌ జైలు రెస్టారెంట్లు నగరంలో నాలుగు చోట్ల (అమీర్‌పేట్‌, ఏఎస్‌రావునగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌) ఉన్నాయి. అందులో అమీర్‌పేటలోని గిస్మత్‌ జైలు అతి పెద్దది. ఇందులో 42 సెల్స్‌ ఉండగా, ఒక్కో సెల్‌లో నలుగురు కూర్చునేలా గదులు ఉన్నాయి. రెస్టారెంట్లో సిబ్బంది కూడా ఖైదీ దుస్తుల్లోనే ఉంటారు.

జైలుకెళ్దాం.. ఆరగిద్దాం..

రెస్టారెంట్లోకి వెళ్లగానే గదులన్నీ చీకటిగా ఉంటాయి. ఖాళీగా ఉన్న సెల్‌లోకి పంపించి వెంటనే గ్రిల్స్‌ మూసివేస్తారు. ఇక ఏం చెప్పాలనుకున్నా జైలు గది నుంచే చెప్పాలి. గదిలో మెనూ స్కానర్‌ కోడ్‌ ఉంటుంది. ఆర్డర్‌ ఇవ్వాలనుకుంటే అందులో ఏర్పాటు చేసిన స్విచ్‌ నొక్కితే ఆ సెల్‌ ఎదుట లైట్‌ వెలుగుతుంది. అది చూసి ఖైదీ వేషంలో ఉన్న సిబ్బంది వస్తారు. గ్రిల్స్‌ మధ్యలో నుంచే ఆర్డర్స్‌ తీసుకుని, భోజనాలను సైప్లె చేస్తారు. జైలు గదిలో స్పాంజి బెడ్స్‌పై కింద కూర్చొని మధ్యలో ఓ చిన్న టేబుల్‌పై పెట్టుకుని తినాల్సిందే. ఎదురెదురుగా ఉన్న సెల్‌లను చూసుకుంటూ నచ్చిన ఫుడ్‌ను ఆరగించాల్సి ఉంటుంది.

జైలులో సెల్ఫీ…

సాధారణంగా జైలులో ఫొటోలు దిగే అవకాశం ఉండదు. కానీ ఈ జైలు థీమ్‌ రెస్టారెంట్‌లో సెల్ఫీల కోసం ఆహారప్రియులు పోటీ పడుతున్నారు. ఎంట్రన్స్‌లోనే పోలీస్‌ అధికారి ప్రతిమ ప్రత్యేక ఆకర్శణగా ఉంది. ఆ ప్రతిమ పక్కన, జైలు గదిలో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.ఈ జైలు థీమ్‌ను నగరవాసులు ఇష్టపడుతుండటంతో మరిన్ని సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా ఈ జైలు రెస్టారెంట్‌ అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు ఈ రెస్టారెంట్‌ అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి ఇందులో ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయటం విశేషం.

జైలును ఎంజాయ్‌ చేశా

మా ఫ్రెండ్స్‌ జైలుకు వెళ్లి తినద్దామా అంటే కంగారుపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్‌ తినడం కన్నా జైలులో ఉండటమే ఆనందాన్నిచ్చింది. జైలులో ఉన్న క్షణాలు కొత్తగా అనిపించాయి. ఫొటోలు దిగడానికే సమయం సరిపోయింది. నగరానికి కొత్తగా వచ్చే అతిథులను ఈ జైలుకు తీసుకొచ్చి తినిపిస్తే భలే థ్రిల్‌ అవుతారు.

– లక్ష్మీ భారతి, ఐటీ ఉద్యోగి

కస్టమర్లకూ ఖైదీ దుస్తులు

కస్టమర్లు ఖైదీ దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారి విన్నపాల మేరకు మరికొద్ది రోజుల్లో ఖైదీ దుస్తులు ఏర్పాటు చేయబోతున్నాం. కస్టమర్‌ రాగానే ఖైదీ దుస్తులు ధరించి ఆరగిస్తారు. మేం తీసుకొచ్చిన ఈ జైలు థీమ్‌కు మంచి స్పందన వస్తుంది.

– బలరామకృష్ణ, ఫ్రాంచైజీ ఓనర్‌, గిస్మత్‌ అరబిక్‌ మండీ

జైలుకు వెళ్లావా..? అని అడుగుతున్నారు

జైలు కాన్సెప్ట్‌ కోసమే ఈ రెస్టారెంట్‌కు వచ్చాను. ఇక్కడ అచ్చం జైలులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. జైలు గదిలో ఫొటో దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. తెలిసినవాళ్లంతా నిజంగా జైలుకు వెళ్లావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాకు భలే సరదాగా అనిపించింది.

– నట్‌రాజ్‌, ప్రైయివేటు ఉద్యోగి

ఫుడ్‌ బాగుంది

జైలు సినిమాలోనే చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా జైలులో ఉన్న అనుభూతి ఉంది. ఇక్కడి జైలు ఫుడ్‌ సంతోషంగా ఆరగించాను. ఎప్పుడూ ఒకే తరహా రెస్టారెంట్లకు వెళ్లి బోర్‌ అనిపించేది. ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో ఏర్పాటవుతున్న రెస్టారెంట్లకు వెళ్లడం సంతోషాన్నిస్తుంది.

– రమ్య, ప్రైయివేటు ఉద్యోగి

జైలు నచ్చింది..

మొదట్లో జైలులో తిండి అంటే నమ్మలేదు. కానీ ఇక్కడికి వచ్చాక జైలు గదులు ఎంతగానో నచ్చాయి. జైలులోకి వెళ్లాక వాళ్లు తాళం వేయడంతో కొంత భయం అనిపించినా.. చుట్టుపక్కల వారిని చూశాక భయం పోయింది. నాకు చికెన్‌ మండీ బాగా నచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన నిర్వాహకులకు స్పెషల్‌ థ్యాంక్స్‌.

– కీర్తిరెడ్డి, ఐటీ ఉద్యోగి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

మూలుగ బొక్కల‌ బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? హైద‌రాబాద్‌లో ఇప్పుడు ఈ బిర్యానీయే ఫేమ‌స్‌

హైద‌రాబాదీ బిర్యానీల్లో న‌యా ట్రెండ్‌ రొయ్య‌ల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement