సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు స్పందన కరువైంది. ఈ నెల 7న సర్కార్ ఆస్తిపన్ను బకాయిదారులు సంబంధిత బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం వడ్డీ రాయితీ పొందాలని ఓటీఎస్‌కు అవకాశం కల్పించింది. భారీ ఎత్తున ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. గడిచిన 11 రోజులుగా ఓటీఎస్‌కు కేవలం రూ. 22 కోట్లు మాత్రమే రావడం గమనార్హం.
కాగా గత రెండేళ్లలో ఓటీఎస్‌ను పరిశీలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వన్‌టైమ్ స్కీం ద్వారా 59838 మంది సద్వినియోగం చేసుకోగా రూ.170కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2023-24 సంవత్సరంలో 108091 మంది సద్వినియోగం చేసుకొని రూ. 320 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్నది. ఈ సారి కూడా రూ. 300 కోట్ల లక్ష్యాన్ని ఖరారు చేసుకోగా నిర్ధేశిత టార్గెట్‌ను అధిగమించడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నాటి వరకు 13 లక్షల మంది నుంచి రూ. 1600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది.