YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసం వద్ద అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తొలగించారు. అయితే, అక్రమ కట్టడాల తొలగింపులో ఆదివారం కీలక పరిమాణం చోటు చేసుకున్నది. జగన్ ఇంటి వద్ద కట్టడాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను సాధారణ పరిపాలన (GAD)లో రిపోర్ట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.
అయితే, లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం వద్ద ఫుట్‌పాత్‌లను ఆక్రమించి సెక్యూరిటీ అవుట్ పోస్టులను నిర్మించారని.. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులతో కట్టడాలను కూల్చివేసినట్లు సమాచారం. అయితే, ఈ కట్టాలను తొలగింపునకు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే ముందుకెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే, జగన్ నివాసానికి దగ్గరలో ఉంటున్న ఓ మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆయా అవుట్ పోస్టులను కూల్చివేసినట్లు సమాచారం.