మెహిదీపట్నం జూన్ 18 : జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 13 లో టౌన్ ప్లానింగ్ ఏసీపీగా సుమన ఆరు నెలల క్రితం నియమితులయ్యారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
సోమవారం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీ సర్కిల్ 13 లోని పవన్ కళ్యాణ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుమన మృతి పట్ల కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ కమిషనర్ శశిరేఖలు సంతాపం వ్యక్తం చేశారు.