Cantonment Board | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి. ఈ మేరకు పలువురు కంటోన్మెంట్ అధికారులు సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా భూ సేకరణపై చర్చించినట్లు సమాచారం.
కాగా కంటోన్మెంట్ బోర్డు పరిధి మొత్తాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రధానంశాలపై అధ్యయనం చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ కమిటీలోని ఉభయ శాఖల అధికారులు కంటోన్మెంట్ బోర్డు విలీనంలో భాగంగా జీహెచ్ఎంసీ అప్పగించనున్న రోడ్లు, ఇతర పౌర సేవల నిర్వహణ అంశాలతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.