సమ్మర్ కోచింగ్.. స్పోర్ట్స్ టీచింగ్.. క్యాంపులకు.. జీహెచ్ఎంసీ సన్నద్ధం..!!
వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది.
- 780 మంది కోచ్‌లు, 44 రకాల ఆటలలో శిక్షణ
- ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు నిర్వహించాలని నిర్ణయం
- శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- దాదాపు రూ.1.42 కోట్లు ఖర్చు చేయనున్న జీహెచ్ఎంసీ
- ఉదయం 6:15 నుంచి 8:15 గంటల వరకు తరగతులు
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది. గత ఏడాది తరహాలో ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 30 వరకు సమ్మర్ కోచింగ్ కా్ంయపు-2023లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔట్‌డోర్, ఇండోర్ స్పోర్ట్స్‌తో పాటు పెయింటింగ్ తదితర మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్ గేమ్స్‌లలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. 6 నుంచి 16 సంవత్సరాల చిన్నారులు ఇందుకు అర్హులు. ప్రతి రోజూ ఉదయం 6:15 నుంచి 8:15 గంటల వరకు ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. 780 మంది ప్రత్యేక కోచ్‌లు, 44 రకాల ఆటలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నిర్వహణకుగాను జీహెచ్ఎంసీ దాదాపు రూ.1.42 కోట్లు ఖర్చు చేయనున్నది.
సమ్మర్ క్యాంపుల లక్ష్యం..!!
- క్రీడల పట్ల అసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. క్రీడా మైదానాలు అభివృద్ధి, వసతుల కల్పన, కొత్త మైదానాల ఏర్పాటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణంతో పాటు ప్రతి ఏటా వేసవిలో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది.
- నగరంలోని అన్ని మున్సిపల్ సర్కిళ్లలో ప్రతి ఏటా వేసవిలో జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా ఒకటిన్నర లక్షల మంది పిల్లలు సమ్మర్ క్యాంపులకు వస్తుంటారు. మే నెలాఖరు వరకు సమ్మర్ క్యాంపులలో శిక్షణ ఇస్తుంటారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు.
- 51 క్రీడల్లో 1,386 సమ్మర్ కోచింగ్ కేంద్రాలను ప్రారంభించి 1482 మంది కోచ్‌ల ద్వారా 1,16,626 మందికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ వస్తున్నారు.
- 75 క్రీడా మైదానాల్లో వివిధ క్రీడలకు సంబంధించి కావాల్సిన పరికరాలను జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంచింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

