సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో దోమల బెడద నివారణకు ఫాగింగ్ చర్యలు ముమ్మరం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం ముందే దోమల బెడద నివారణ చేసి రానున్న వర్షాకాలంలో దోమల నివారణను సమర్థవంతంగా ఎదురొనేందుకు దోహద పడుతుందనే ఉద్దేశంతో పైలెట్‌గా కొన్ని సరిల్లో ఫాగింగ్ చర్యలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు పేర్కొన్నారు. గోషామహల్ సరిల్లో దత్తాత్రేయ నగర్, మూసారం బాగ్ డివిజన్లో అరోరా కాలేజీ వెనుక భాగంలో ఫాగింగ్ చేపట్టినట్లు చెప్పారు.
అంబర్ పేట డివిజన్లో పటేల్‌నగర్ న్యూ పటేల్‌నగర్ చెన్నారెడ్డి నగర్, కాకతీయ లైన్, బాబునగర్ పాలిటెక్నిక్ రోడ్డు, ఆకాశ్ నగర్ కుమార్ నగర్ ఓవైసీ నగర్ ప్రాంతాల్లో ఫాగింగ్ చర్యల్లో ఎంటమాలజీ అధికారులు సిబ్బంది పాల్గొని ముమ్మరంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వీఎంఎఫ్ యంత్రాల ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో పీఎంఎఫ్ యంత్రాల ద్వారా ఫాగింగ్ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. అలాగే సరూర్ నగర్ సరిల్ గడ్డి అన్నారం డివిజన్, కాప్రా సరిల్ లో వెంకటేశ్వర నగర్, మంగాపురం కాలనీ, కృష్ణ నగర్ కాలనీలో మీర్‌పేటల్లో సంబంధిత కార్పొరేటర్లతో కలిసి ఫాగింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లు వివరించారు.