సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బుధవారం అధికారులు బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నాంపల్లి రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, కేబీఆర్ పార్కు, అంబర్‌పేట చౌరస్తా, అమీర్‌పేట చౌరస్తా, బల్కంపేట టెంపుల్, నానల్‌నగర్ చౌరస్తా,
ఆరాంఘర్ చౌరస్తాలో ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 107 మంది యాచకులను గుర్తించగా, 37 మందిని చౌటుప్పల్ సమీపంలోని అమ్మా-నాన్న అనాధాశ్రమానికి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య పరీక్షలు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మరో 40 మందిని జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ షెల్టర్స్ హోమ్స్‌లో ఎన్జీవోల సహకారంతో చేర్చించారు. మిగతా వారికి కౌన్సిలింగ్ చేసి వారి స్వస్థలాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.