సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ ) : భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా చేపడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. నగరం నలువైపులా సీ అండ్ డీ (కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసి.. భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకొస్తున్నారు. తొలుత జీడిమెట్ల, నాగోల్ ఫతుల్లాగూడలో సీ అండ్ డీ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, శంషాబాద్, తూంకుంటలో ఇటీవల అదనంగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. అయితే అక్రమ డంపింగ్‌లు, వ్యర్థాల తరలింపులో ఇష్టారీతిన కొందరు యజమానులు వ్యవహరిస్తుండడంతో 13 వ్యర్థాల కలెక్షన్ పాయింట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్‌కు సంబంధించి 9705433369, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ పరిధికి 8885737472, 6302074614 నంబర్లలో సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అలాగే ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట, యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలో వాట్సాప్ 1800 120 1159, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్సీ పురం, పటాన్చెరు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్‌కు సంబంధించి 9100927073, చాంద్రాయణగుట్ట, చా ర్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్, కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్‌కు సంబంధించిన వాట్సాప్ 18002030033, 7330000 203 నంబర్లను సంప్రదించి వ్యర్థాలను జీహెచ్ఎంసీకి అప్పగించాలన్నారు.