పూడికతీసి.. వ్యర్థాలు ఏరి.!
వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా.. రోడ్లపై నీరు నిలవకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా యంత్రాంగం దృష్టి సారించింది
- వానకాలం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
- చెరువుకు ఒక ఇన్చార్జి, ఇద్దరు పర్యవేక్షకులు
- వరదను బట్టి దిగువకు నీటి విడుదల
- గ్రేటర్‌వ్యాప్తంగా 139 మాన్సూన్ బృందాలు
- మే ఆఖరికల్లా పూడికతీత, నాలా అభివృద్ధి పనులు పూర్తి
- 1302 కిలోమీటర్ల మేర నాలాల అభివృద్ధి.. విస్తరణ పనులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా.. రోడ్లపై నీరు నిలవకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు వర్షాకాల సమస్యల పరిష్కారానికి దాదాపు రూ. 32.96 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌తో మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసింది. వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలాల పూడికతీత పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వరద ప్రభావిత ప్రాంతాలపై పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద అంచనాను బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం లాంటి చర్యలు చేపట్టనున్నారు. నాలాలతో పాటు చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సర్కిల్‌కు ప్రత్యేక వాహనాలతో మాన్సూన్ బృందాలను నియమించనున్నారు.
- మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రాంతాల వారీగా 139 బృందాలను రంగంలోకి దింపనున్నారు.. వీరంతా (స్టాటిక్ లేబర్ టీం) కేటాయించిన ఆయా ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నారు. ఇక భారీ వాహనాలతో నలుగురితో కూడిన 67 బృందాలు, మినీ మొబైల్‌తో 128 బృందాలు డీఆర్ఎఫ్ టీంతో కలిసి సహాయక చర్యలు చేపట్టనున్నారు.
- స్టాటిక్ లేబర్: ఒకరు లేదా ఇద్దరు నీరు నిలిచిన ప్రాంతాలు, క్యాచ్‌పిట్ (గుంతలు) ఉన్న ప్రాంతా ల్లో సహాయక చర్యలు చేపడతారు. ఒకే చోట ఉండే వీరంతా కేటాయించిన ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.
- మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు: ఒక్కో వాహనం (టాటా ఏసీ/జీపు)లో నలుగురు కార్మికులు ఉంటారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. వీరితో పాటు మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో ఒక్కో వాహనం ( డీసీఎం/ట్రాక్టర్, ట్రాలీ) లో నలుగురు సిబ్బంది ఉంటారు. చెట్లు విరిగి పడిన, నీరు నిలిచే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతారు.
శరవేగంగా పూడికతీత
వర్షాకాలంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఎస్ఎన్డీపీలో భాగంగా రూ. 858 కోట్లతో నాలాల అభివృద్ధి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. మే నెలాఖరు కల్లా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నాలాల పూడికతీత పనులపై దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడవునా నాలాలు, వరద నీటి కాలువలు ఉన్నాయి. గత ఏడాది రూ. 41.38 కోట్లతో 345 పనులు చేపట్టి మొత్తం 5.15 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పూడికతీత పనులు చేపట్టారు. ఈసారి 356 పనులను రూ. 44.45 కోట్లతో చేపట్టగా, ఇప్పటి వరకు 4.59 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నాలా పూడికతీత పనులు చేపట్టారు. ఆరుగురు ఎస్ఈలు, ఆయా జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో పూడికతీత పనులు సాగుతున్నాయి. పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఏ రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి.? ఏ మేరకు పనులు జరిగాయి.? అనే అంశాలను పరిశీలిస్తూ పనులను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఎన్ఎన్డీపీ మొదటి దశ పనులను మే నెలాఖరు నాటికల్లా పూర్తిచేసి వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

