సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డిలతో కలిసి కమిషనర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో 25 విన్నపాలు రాగా, టెలిఫోన్ ద్వారా 4 విన్నపాలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సత్యనారాయణ, యాదగిరి రావు, నళిని పద్మావతి, సీసీపీ కె. శ్రీనివాస్, అదనపు సీసీపీ గంగాధర్, ఆయా విభాగాల వాల్యుయేషన్ అధికారి మహేశ్ కులకర్ణి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, ఎస్ఈ హౌసింగ్, జాయింట్ కమిషనర్ ఎంబీఎం కృష్ణకుమారి పాల్గొన్నారు.