Get together | కందుకూరు, మే 25 : పాతికేళ్ల తర్వాత స్నేహితులంతా ఒక దగ్గర కలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కందుకూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1999-2000 ల విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం నాడు మండల కేంద్రంలో ఒకే చోట చేరారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా 25 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి సిల్వర్ జూబ్లీ నిర్వహించారు. ఆనాడు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రాఘవ చారి , పెంటయ్య , లక్ష్మారెడ్డి , వెంకటయ్య , సుదర్శన్ రెడ్డి, అయ్యుబ్ ,ఆనంద్, లను సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తరగతి గదిల్లో చేసిన చిలిపి చేష్టలను యాది చేసుకున్నారు. రోజంతా పిల్లాపాపలతో కలిసి గడిపారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.