హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా ..జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో సినీ నటి గీతికా రతన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గీతిక రతన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. భావి తరాలకు మంచి ఆక్సిజన్ ఇవ్వాలంటే మొక్కులు నాటాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తర రెడ్డి, సుమయా రెడ్డి, సాయి కృష్ణ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.