Ganja | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 12 కోట్ల విలువ చేస్తుందని స్పష్టం చేశారు. గంజాయిని తరలించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.