మారేడ్పల్లి, మే 8 : ఒడిశా నుంచి గుజరాత్ కు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుల వద్ద నుంచి 8 లక్షల 95 వేల 450 రూపాయాల విలువ చేసే 17.909 కిలో విలువ చేసే గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు వెల్లడించారు. ఒడిశా కి చెందిన దీపక్ స్వైన్ కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్ లోని సూరత్ లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నిందితుడు దీపక్ స్వైన్ ఓ మైనర్ బాలుడి (16) తో కలిసి తన స్వగ్రా మం అయిన ఒడిశాకు వచ్చాడు. వీరిని స్థానికంగా ఉన్న రాజేష్ కుమార్ అనే వ్యక్తి సంప్రదించాడు. ఒక్కొక్క గంజాయి ఫ్యాకెట్ను తరలిస్తే రూ.7 వేల రూపాయాలు చెల్లిస్తానని ప్రలోభపెట్టాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిందితులు గంజాయి అక్రమ రవాణ సరఫరాకు ఒప్పుకున్నారు. అనంతరం ప్రధాన నింధితుడు రాజేష్ కుమార్ సూచన మేరకు పుల్బాని అటవీ ప్రాంతంలో గంజాయి ప్యాకెట్లు స్వీకరించి, రెండు ట్రాలీ సూట్ కేసుల్లో దాచుకొని విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సూరత్ కు వెళ్లేందుకు రాత్రి రైలు కోసం జనరల్ వెయిటింగ్ హాల్లో వేచి ఉండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. మైనర్ బాలుడిని జువెనైల్ హోంకు తరలించగా, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.