Hyderabad | కొండాపూర్, జూన్ 26 : మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉండే హరినాథ్(24), శివాజీ(25)లు మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో మత్తుకు బానిసైన వారిని టార్గెట్ చేసుకుని ఎక్కువ ధరలకు గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. ప్రణాళిక ప్రకారం.. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.