గాంధీలో నిరుపేద యువతికి క్లిష్టమైన శస్త్రచికిత్స.. 7.5 కిలోల ఒవేరియన్ కణతి తొలగింపు
ఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఒక నిరుపేద యువతికి పైసా ఖర్చులేకుండా క్లిష్టమైన శస్త్రచికిత్స జరిపారు గాంధీ వైద్యులు. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి నుంచి విజయవంతంగా 7.5కిలోల ఒవేరియన్ కణతిని తొలగించారు. ఈ మేరకు కేసు వివరాలను గాంధీ దవాఖాన గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ ఎస్.సంగీత వెల్లడించారు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ళ యువతి స్థానికంగా ఉన్న దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తుంది. గత కొన్ని రోజులుగా సదరు యువతి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో పాటు కడుపు ఉబ్బడంతో మూడు రోజుల క్రితం గాంధీ వైద్యులను ఆశ్రయించింది. ఈ మేరకు వైద్యపరీక్షలు జరిపిన డాక్టర్లు రోగి కడుపులో ఒవేరియన్ కణితి ఉన్నట్లు నిర్ధారించారు.
ఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గురువారం ఉదయం గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. ఈ శస్త్రచికిత్సలో రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం పూర్తి నిలకడగానే ఉందని గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ సంగీత తెలిపారు. ఈ శస్త్రచికిత్స ప్రైవేటులో అయితే కనీసం రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అయితే ప్రైవేటులో వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక గాంధీని ఆశ్రయించినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

