హైదరాబాద్ : గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరమ్మాయిలతో పాటు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సాయి సిద్ధూ పలు విషయాలను వెల్లడించాడు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు చెప్పాడు.
సాయి సిద్దూ మాటల్లోనే.. ‘మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్‌లో బయటకు వెళ్లడం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు రమ్మని అడిగితేనే బయటకు వచ్చాను. నాకు డ్రైవింగ్ రాదు.. అబ్దుల్ అనే కుర్రాడు బ్లాక్ డాగ్ తాగాడు. అమ్మాయిలు బీర్లు తాగారు. కారు అబ్దులే నడిపాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నేను అప్పట్నుంచి కోమాలోనే ఉన్నాను. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తే జీరో వచ్చింది. అమ్మాయిలు చెప్తే వినకుండా బయటకు తీసుకొచ్చారు’ అని సాయి సిద్దూ పేర్కొన్నారు.