ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 27: ఉస్మానియా యూనివర్సిటీ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్‌సీడీసీ)లో ‘డిజిటల్ మార్కెటింగ్’పై(Digital marketing) ఉచిత ఐదు రోజుల శిక్షణ(Free training) సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ ప్రారంభోత్సవానికి హెచ్‌సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీవీ రంజని, కోఆర్డినేటర్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ శిక్షణా ప్రాధాన్యతను వివరించారు. ఈ శిక్షణ ద్వారా వివిధ డిజిటల్ వేదికలపై ప్రాక్టికల్ నైపుణ్యాలను అలవర్చడంతో పాటు వారి ఉద్యోగావకాశాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..