Kajal Aggarwal | అందం, అభినయంతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ భామ నెక్ట్స్ కన్నప్పలో కనిపించనుందని తెలిసిందే. కాగా ఈ బ్యూటీ హిందీలో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. ఇంతకీ ఈ సినిమా ఏంటనే కదా మీ డౌటు.
శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్లో నటిస్తోన్న ది ఇండియా స్టోరీ. ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఈ మూవీ తొలి షెడ్యూల్ పూణేలో మొదలైంది. ఈ షెడ్యూల్ ఫస్ట్ షూట్లో పాల్గొన్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది కాజల్ అగర్వాల్. బిగ్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చెప్పని, ప్రభావవంతమైన కథనంలో భాగమవడం పట్ల ఎక్జయిటింగ్ అవుతున్నట్టు తెలియజేస్తూ క్లాప్ పట్టుకున్న స్టిల్‌ను షేర్ చేసింది.
సాగర్ బీ షిండే కథనందించిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నాడు. సాగర్ బీ షిండే ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ది ఇండియా స్టోరీ 2025 ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
#KajalAggarwal next movie update:
“Starting our first schedule in Pune for The India Story!
Thrilled to bring this untold and powerful story to life. Save the date – 15/8/25.
See you in theatres! 🎥✨ #IndiaStory #ComingSoon@shreyastalpade1@ChettanDk@migsocial8… pic.twitter.com/g04r7tMvA5
— Chinna Chinna Asai (@chennaitodaynew) January 27, 2025