AP News | కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. వీటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది. ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తర్వాత కూడా రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు తగ్గడం లేదని పేర్కొంది. ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కొందరు టీడీపీ నేతలు, వారి కుమారులు కూడా ఉన్నారని తెలిపింది. గత 20 రోజుల్లో ఏపీలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను గుర్తు చేసింది.
5-1-2025
బాలికను గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కోటిపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్త 9వ తరగతి బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. యువకుడిని నిలదీస్తే.. తాను టీడీపీ కార్యకర్తనంటూ బెదిరిస్తున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
6-1-2025
కృష్ణా జిల్లా గుడివాడలోని రైలుపేటలో ఉండే యెండూరి జోజిబాబు చిన్నా ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
12-1-2025
నాలుగేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను డాబాపైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులను నిలదీయగా.. బాధిత కుటుంబం పైనే దాడికి పాల్పడ్డారు.
13-1-2025
బిస్కెట్ల ఆశ చూపి 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో 4వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల చిన్నారిని భోగి పండుగ రోజు గ్రామానికి చెందిన నారు ప్రసాద్ చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి సమీపంలోని ప్రభుత్వ సచివాలయం భవనంపైకి తీసుకువెళ్లి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. తోటి చిన్నారులు జరిగిన విషయాన్ని బాలిక సోదరుడికి చెప్పారు.. బాలికకు తల్లి లేకపోవడం, తండ్రి ఉద్యోగరీత్యా మరో చోట ఉండటంతో విషయం ఆలస్యంగా బయటికొచ్చింది.
15-1-2025
ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో చింతల నాగేంద్ర అనే మహిళ హత్యకు గురైంది. ఆమెతో సహజీవనం చేస్తున్న తోగటి హనుమంతరావు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
15-1-2025
కూతురి వరుసైన చిన్నారిపై లైంగిక దాడి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో 4వ తరగతి చదువుతున్న చిన్నారిపై ఆమె సొంత పెద్దమ్మ భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు.
15-1-2025
మహిళ జుట్టు కత్తిరించి.. దుస్తులు చించి.. ఆటవిక ప్రవర్తన. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో ప్రేమ వ్యవహారంలో అదృశ్యమైన బాలిక కొద్దిరోజులకు తిరిగి వచ్చింది. దీంతో సంబంధం ఉందనే అనుమానంతో వెంకటలక్ష్మి అనే మహిళను బాలిక బంధువులు కొట్టి జుట్టు కత్తిరించారు.
21-1-2025
మైనర్ దివ్యాంగురాలిపై వృద్ధుడి అత్యాచారం – విశాఖ జీవీఎంసీ 4వ వార్డు జేవీ అగ్రహారంలో నివసిస్తున్న ఎర్రారెడ్డి 21న మద్యం సేవించి తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన మైనర్ దివ్యాంగురాలి(14)పై అత్యాచారం చేశాడు.
21-1-2025
విశాఖలోని పీఎం పాలెం పరిధిలోని హెచ్ పీ సీఎల్ లే అవుట్ లో 15 ఏళ్ల బాలికపై నల్ల సాయితేజ(30) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.
26-01-2025
జట్టు పట్టుకుని మహిళను ఈడ్చుకెళ్లారు. విశాఖ నార్త్ డివిజన్ పరిధిలోని మిథిలాపురి ఉడా కాలనీ సమీపంలో నాగలక్ష్మి రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్టును రమేష్ అనే వ్యక్తి నుంచి అద్దెకు తీసుకుని దుకాణం నడుపుతోంది. ఆమె సాయంకాలం వ్యాపారం నిమిత్తం వెన్నెల అనే మరో మహిళకు దానిని అద్దెకు ఇచ్చింది. వీరిద్దరి మధ్య కొద్దికాలంగా అద్దె విషయంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వెన్నెల, మరో వ్యక్తి కలిసి నాగలక్ష్మిపై దాడి చేసి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.
26-01-2025
చిన్నారులపై టీడీపీ నేత దాష్టీకం. తన కుమార్తె పుస్తకంలోని పేజీలు చించారని పిల్లలపై దాడి . ప్రకాశం జిల్లా కంభం మండలంలోని ఎల్ కోట పంచాయతీకి చెందిన టీడీపీ నేత గని చిన్న వెంకటేశ్వర్లు కుమార్తె ఎల్. కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. తన కూతురి పుస్తకంలో కొన్ని పేజీలను ఎవరో చించారు. అదే తరగతిలో చదువుకుంటున్న పిల్లలే చించారన్న అనుమానంతో శనివారం సాయంత్రం మరో ఇద్దరితో పాఠశాలలలోకి వచ్చి తమ పిల్లలను తీవ్రంగా కొట్టారని తల్లిదండ్రులు వాపోయారు.
27-01-2025
అనకాపల్లి జిల్లాలో దారుణం. 8వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హాకీ క్రీడాకారుడు రూపేశ్. హాకీ సాధనం కోసం వచ్చిన మైనర్ బాలికపై కన్నేసిన రూపేశ్. మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు.