Tech Mahindra | అమీర్పేట్, ఫిబ్రవరి 28 : టెక్ మహీంద్రా ఫౌండేషన్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ దీప్తి తెలిపారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీలు విద్యార్హతలుగా ఉంటాయని, అభ్యర్థుల వయసు 18 నుండి 35 లోపు ఉండాలని, ఈ కోర్సులకు సంబంధించిన క్లాసులు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని తెలిపారు. కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయని ముఖ్యంగా మహిళలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మరిన్ని వివరాలకు ఎర్రగడ్డ రైతు బజార్ ఎదురుగా ఉన్న (మెట్రో పిల్లర్ నంబర్ A980 ) సనత్ నగర్ సెయింట్ తెరిసా చర్చి కాంపౌండ్ ఆవరణలో ఉన్న టెక్ మహీంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ కార్యాలయంలో లేదా 7337332606 లో సంప్రదించాలని ప్రాజెక్ట్ మేనేజర్ దీప్తి తెలిపారు.