అమీర్‌పేట్, ఫిబ్రవరి 27: సనత్‌నగర్ లయన్స్ క్లబ్, సంకేత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన సనత్ నగర్‌లోని వెజిటబుల్ మార్కెట్ గ్రౌండ్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నాయి. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్- బల్కంపేట శంకర్ నేత్రాలయ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రవీందర్ గౌడ్ నేతృత్వంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ ఉచిత వైద్య శిబిరం మార్చి ఒకటో తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో భాగంగా కంటి పరీక్షలు చేయించుకునే వారికి అవసరమైతే కంటి అద్దాలు, అత్యవసరమైతే ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తామని డాక్టర్ ఎస్ రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్సార్ నగర్ ఏసీపీ పీ వెంకట్ రమణ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు అతిథులుగా విచ్చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికులకు సంకేత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మురళి ఫణి విజ్ఞప్తి చేశారు.