Rashtrapati Nilayam | బొల్లారం,ఆగస్టు 28: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులు, క్రీడా ఔత్సాహికులకు రాష్ట్రపతి నిలయంలోకి శుక్రవారం ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డును జాతీయ, అంతర్జాతీయ కార్డును ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని వెల్లడించారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించేందుకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి నిలయం యొక్క చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందడానికి ఈ అవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.