హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని అన్ని హెచ్ఎండీఏ పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్క్, మెల్కొటే పార్క్, ప్రియదర్శిని పార్క్, రాజీవ్ గాంధీ పార్క్, పటేల్‌కుంట పార్క్, లంగర్‌హౌస్ పార్కులో ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.