సిటీబ్యూరో: ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఈమేరకు సోమవారం ఈమెయిల్ ద్వారా సీఎంకు లేఖ రాసింది. ప్రభుత్వం జలమండలిని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు విస్తరింపజేసి సేవలను కూడా అందజేస్తున్నది. కానీ ఉచిత తాగునీటి పథకం మాత్రం వర్తింపజేయడం లేదని పేర్కొన్నది.
నగర అభివృద్ధిలో సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో నివసించే ప్రజలు కూడా భాగస్వాములేనని, వారు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని తెలిపింది. వెంటనే ఆయా ప్రాంతాల్లోని అర్హులైన అన్ని గృహాలకు ఉచిత తాగునీటి పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది.