GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కిమ్స్, సైన్షైన్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ విమలాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు,సిబ్బంది కార్మికులతో సహా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రధాన కార్యాలయానికి వచ్చి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.