Hyderabad | బంజారాహిల్స్, మార్చి 19 : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లోని సూఫీ చాంబర్స్ 4వ అంతస్తులోని ఫ్యూజన్ ఫ్యూచర్ హబ్ పేరుతో కన్సల్టెన్సీ సంస్థ పేరుతో ద్వారా నిరుద్యోగులకు వలవేస్తున్నారని నాగారం ప్రాంతానికి చెందిన జి దివ్య, మనోజ్ఞ, తదితరులు మంగళ వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుకు సుమారు 20 నుంచి 30 మందిని పిలిపించి ఇంటర్వ్యూ పేరుతో రూ. 3000 నుంచి రూ. 5000 వసూలు చేశారని, ఇలాంటి వారు వందలాది మంది బాధితులు ఉన్నారని విచారణలో తేలింది. దీంతో సంస్థ డైరెక్టర్ ఆర్జూ, వైభవ్, డేవిడ్, హరీష్ లను బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.