హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శంషాబాద్ ఎగ్జిట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి డీసీఎం క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘట్కేసర్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారి వివరాలు తెలియాల్సి ఉన్నది.