కుత్బుల్లాపూర్,సెప్టెంబర్29: పేరుకు చరిత్ర గల పార్టీలు.. కానీ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంచెలంచెలుగా స్వరాష్ట్ర స్వతహాగా ఎదిగి పరిపాలన యావత్ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటే అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం రూ.5.10 కోట్ల వ్యయంతో చేపట్టిన కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు సీసీరోడ్లు, బీటీరోడ్లు, ప్యాచ్‌వర్క్‌లు, స్టోర్మ్వాటర్డ్రైన్, ఆర్సీసీపైపులైన్, సెప్టిక్‌ట్యాంక్, కమ్యూనిటీహాల్, ఓపెన్‌జిమ్, బస్తీదవాఖానలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. కొంపల్లి మున్సిపాలిటీ స్వచ్ఛతలో ఆదర్శవంతంగా నిలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో అవార్డు తీసుకుంది కానీ సెంట్రల్ నుంచి కొంపల్లికి వచ్చిన ప్రోత్సాహం ఏమీ లేకుండా పోయిందన్నారు.
కానీ మన రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో స్వచ్ఛతలో పేరుగాంచిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహకం కింద రూ. రెండు కోట్లు ప్రకటించారని త్వరలో వాటి నిధుల విడుదల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిపాలనతో పాటు అభివృద్ధిలో రాజీ లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికి వర్తించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొచ్చే బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చే పగటివేషగాళ్ల మాటల గాడిలో పడి ప్రజలు మోసపోరాదని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గులాబీజెండాకు ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషనర్ కె.శ్రీహరి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్, డీహెచ్ఓ శ్రీనివాస్, డా.నిర్మల, కౌన్సిలర్లు చింతల రవీందర్‌యాదవ్, డప్పు కిరణ్‌కుమార్, పార్టీ శ్రేణులు చింతల దేవేందర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 21 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ చేతుల మీదిగా రూ.21,02,432 విలువ చేసే షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులతో పాటు కమిషనర్ శ్రీహరి, రెవెన్యూ అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చారు.