వెంగళరావునగర్,నవంబర్ 2 : బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ లో మార్నింగ్ వాక్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
మాగంటి ఆశయాల సాధన కోసం మాగంటి సతీమణి సునీత ప్రజా సేవ చేసేందుకు ముందుకొచ్చారని అన్నారు. మాగంటి సునీతకు ప్రజాదరణ మెండుగా ఉందని..ఆమె విజయం తధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.