షేక్‌పేట్, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు ముఠా జయసింహ, చెరక మహేష్‌తో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాలవారి మద్దతు మాగంటి సునీతకే ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ గంగపుత్రుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. షేక్‌పేట్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుర్రం నాగరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనం దేశి మాణిక్ రావు, ప్రధాన కార్యదర్శి చెరక గణేష్ పాల్గొన్నారు.
బృందావన్ కాలనీలో జీవన్‌రెడ్డి ప్రచారం
షేక్‌పేట్ డివిజన్లోని బృందావన్ కాలనీలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సోదరులను సలాం, ఆదాబ్ అంటూ అప్యాయంగా పలకరించి కేసీఆర్ సాబ్‌కు ఓటు ఇవ్వాలని కోరారు. మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జీవన్‌రెడ్డి ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా షేక్‌పేటలో ఆటో నడిపారు. ఆయన వెంట నాయకులు ముఠా జయసింహ, శ్రీధర్ రెడ్డి, అక్బర్ హుస్సేన్, షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.