బేగంపేట్: ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కిడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు రూ. 2500, అలాగే రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, ఇస్తామని అనేక హామీలు మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చి సుమారు మూడేండ్లు అవుతున్నా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అండర్‌పాస్‌లు, రోడ్లు, కలెక్టరేట్లు, ఆసుపత్రులు, ఫ్లైఓవర్లు నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ నిర్మించలేదని చెప్పారు. మరో రెండేండ్లలో తిరిగి అధికారంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రాబోతున్నదని చెప్పారు. కాగా, రక్షాబంధన్ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతికి రాఖీలు కట్టారు.