హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అమీర్ పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శివలక్ష్మి పార్ధీవ దేహంపై పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట అమీర్ పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఉత్తమ్ సింగ్ తదితరులు ఉన్నారు.
కాగా, కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న శివలక్ష్మి హైదరాబాద్ అమీర్‌పేటలోని స్వగృహంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం వారి కుటుంబంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విషాదం నింపింది. శివలక్ష్మి మరణం పట్ల రాజకీయ నాయకులు నివాళులర్పిస్తున్నారు.