బంజారాహిల్స్,అక్టోబర్ 23 : కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించాలంటూ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్‌నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు చేతినిండా పని దొరికేదని, అన్ని సంక్షేమ పథకాలు అందేవని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. 23నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఖాయమన్నారు.