Sabitha Indra Reddy | కందుకూరు : కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లేమూరులో మాట్లాడారు. ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే రోజున మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టి మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టి మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన కృషి వల్లే నేడు రాష్ట్రంలో పచ్చదనంతో విరాజిల్లుతుందని చెప్పారు. హరితహారం కేసీఆర్ మానస పుత్రికని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహరానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అడవులు అంతరించి పోవడంతో ఎడారిగా మారి వర్షాలు సరిగా కురువక ప్రజలు ఇబ్బందులుపడుతున్న తరుణంలో కేసీఆర్ హరితహారం తీసుకువచ్చి.. మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనరసింహారెడ్డి, కాకి ధశరథ ముదిరాజ్, మేఘనాథ్ రెడ్డి, మాజీ సర్పంచులు పరంజ్యోతి, నరేందర్ గౌడ్, గణేశ్, భూపాల్ రెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, సురుసాని సుదర్శన్ రెడ్డి, సురుసాని కొండల్ రెడ్డి, యాదగిరి, సురేష్ భూపాల్ రెడ్డి, గుయ్యని సామయ్య, సంజీవరెడ్డి, మోహన్ రెడ్డి, కాకి రాములు చంద్రశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి లక్ష్మయ్య సామేల్ రాజ్, లిక్కి జంగారెడ్డి పాల్గొన్నారు.