రైతులను మోసం చేస్తే ఊరుకోం
రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నాన్ని ఆపకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఉద్యమిస్తామన్నారు.
- మహాధర్నాలో మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, శామీర్‌పేట, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): : రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నాన్ని ఆపకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఉద్యమిస్తామన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో రైతులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటేసిన పాపానికి పగటి దొంగల లెక్క భూములను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. 50-60 ఏండ్లుగా సాగులో ఉండటంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, ఎన్వోసీలు, ధరణి పాస్‌పుస్తకాలు ఉన్నా.. 1049 ఎకరాల భూములను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు కోటి ఎకరాల పైచిలుకు 22 ఏలోకి తీసుకున్నారన్నారు. బొమ్మరాసిపేట రైతులకు 22 ఏ రికార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయానికి గురి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఈ మహాధర్నాలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మాజీ మేయర్ కావ్య, మాజీ చైర్మన్లు రాజేశ్వర్‌రావు, పావని, మాజీ ఎంపీపీ ఎల్లూబాయిబాబు, మాజీ జడ్పీటీసీ అనితలాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

