శంషాబాద్ రూరల్ :కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్య త బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లాలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహమూద్ అలీ పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 29న ఉదయం 8 గంటలకు ఎవ్వరికి వారు వారి గ్రామాలు, వార్డులలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పాటు 10 గంటలకు శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, తీగల విక్రంరెడ్డి, అనంతరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గణేశ్, సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సయమ్మశ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ సతీశ్, శంషాబాద్ కౌన్సిలర్ భారతమ్మ, నాయకులు పాల్గొన్నారు.