Errabelli Dayakar Rao | బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు నేతలు పోలీసులు అడ్డుకున్నారు. అయితే, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అరెస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. కోర్టుకు పంపకుండా సమయాన్ని విచారణ పేరుతో వృథా చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేను కలువకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం పాడి కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఏసీపీ వెళ్లిపోయారు. అయితే, ఫిర్యాదును తీసుకోవాలని సీఐని కోరగా.. ఆయన సైతం వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘేవంద్ర ఫిర్యాదు మేరకు.. కౌశిక్‌రెడ్డితో పాటు 20 మంది అనుచరులపై కేసులు నమోదు చేశారు. గురువారం కొండాపూర్‌లోని నివాసం వద్దకు పోలీసులు చేరుకొని.. పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ దాదాపు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకు ముందు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్న హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. దాదాపు ఏడెనిమిది గంటలుగా ఆయనను ఠాణాలోనే ఉంచారు.