జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ మహా నగరంలో పనికి ఆహార పథకాన్ని ప్రవేశ పెట్టి పనులు దొరకక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు(Construction workers) వర్తింప చేయాలని జూబ్లీహిల్స్ సీఐటీయూ జోన్ కన్వీనర్ జె.స్వామి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రహ్మత్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ పి ఆర్ హిల్స్ చౌరస్తాలో జరిగిన సమావేశానికి హాజరై కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. లేబర్స్కు మెటర్నిటీ బెనిఫిట్స్, మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇచ్చే రూ.30 వేల మొత్తాన్ని లక్ష చొప్పున పెంచాలని.. సహజ మరణానికి ఇస్తున్న రూ1.30 లక్షను రూ.5 లక్షలకు పెంచాలన్నారు.
ప్రమాద కారణంగా మృతి చెందిన వారికి ఇస్తున్న రూ.6.30 లక్షలలను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు. నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని, నగరంలోని అన్ని లేబర్ అడ్డాలలో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్షులు బి.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బి.దేవదాస్, నాయకులు బి బాలయ్య, ఆర్. జైపాల్, ఏ ఆర్ నరసింహ, టి.భాగ్యరావు, తదితరులు పాల్గొన్నారు