మూసీ నదిలో తగ్గుతున్న వరద ప్రవాహం..
Musi river | జంట జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. బుధవారం ఉదయం ఉప్పొంగిన మూసీ శాంతించింది. దీంతో చాదర్‌ఘాట్ వద్ద ఉన్న దిగువ
హైదరాబాద్: నగరంలోని జంట జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. బుధవారం ఉదయం ఉప్పొంగిన మూసీ శాంతించింది. దీంతో చాదర్‌ఘాట్ వద్ద ఉన్న దిగువ వంతెనకు అడుగు కిందకు ప్రవహిస్తున్నది. అయితే ప్రవాహం కొనసాగుతుండటంతో పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇక మూసారాంబాగ్ వద్ద కూడా వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం బ్రిడ్జి కింద వరద ప్రవహిస్తున్నది. అయితే వరద తగ్గినప్పటికీ పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. బ్రిడ్జిపై వ్యర్థాలను తొలగించిన తర్వాత రాకపోకలు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.
జంట జలాశయాలకు తగ్గిన వరద
జంట జలాశయాలకు వరద తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి 3 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్ల ద్వారా 6,090 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుకాగా, ప్రస్తుతం 1,787.55 అడుగుల వద్ద నీరు ఉన్నది.
ఇక హిమాయత్‌సాగర్‌కు 4 వేల క్యూసెక్కులు వస్తుండగా, 330 క్యూసెక్కుల వదర నదిలో వచ్చిచేరుతున్నది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.50 అడుగులు. గరిష్ఠనీటిమట్టం 1763.50 అడుగులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

