Hyderabad | నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు, ఇంకా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు పడటంతో పలు కాలనీలు, బస్తీలు, కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి.
ఈ నేపథ్యంలో నివాసాలలోకి నీరు చేరడంతో జన జీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పలు కాలనీలలో విద్యుత్, తాగునీరు లేక జనం ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైన యంత్రాంగం సేవలందిస్తున్నారు.