వరద నీరు సాఫీగా మూసీలోకే..

- రూ. 858కోట్లు..15 ప్యాకేజీలు
- తొలి విడతలో రూ. 267.07 కోట్ల పనులకు శ్రీకారం
- నాలాల విస్తరణ, ఆధునీకరణకు చర్యలు
- విడతల వారీగా పనులను చేపట్టనున్న ఎస్ఎన్డీపీ
సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలను వేగిరం చేసింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలకు నడుం బిగించింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కార్ నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారీ ప్రణాళికల రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా తక్షణ చర్యలకుగాను ప్రభుత్వం రూ. 858కోట్లు మంజూరు చేసింది.
నెలాఖరున పట్టాలెక్కనున్న పనులు
చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి, తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతం కోసం అధికారులు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో రూ.609 కోట్ల అంచనాలో కొన్ని ఫ్యాకేజీలకుగాను రూ. 267.07కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్ల దశకు తీసుకువచ్చారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతూనే మరోపక్క పెండింగ్‌లో ఉన్న ఫ్యాకేజీలకు డీపీఆర్ రూపకల్పన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని ఫ్యాకేజీల పనులను పట్టాలెక్కించునున్నారు. గొలుసుకట్టు చెరువులన్నింటిని అనుసంధానించి.. చెరువుల్లోకి మురుగు చేరకుండా ఉండటంతో పాటు వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.
పురోగతిలో ఉన్న నాలా అభివృద్ధి పనుల వివరాలు
- జోన్ ప్రాజెక్టు అంచనా టెండర్ల దశలో
- వ్యయం ఉన్నవి (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
- ఎల్బీనగర్ 113.59 113.59
- చార్మినార్ 85.61 8.74
- ఖైరతాబాద్ 100.26 –
- సికింద్రాబాద్ 163.00 16
- శేరిలింగంపల్లి 33.74 33.74
- కూకట్పల్లి 112.80 95.00 609.00 267.07
మొత్తం 15 ప్యాకేజీలకుగాను రూ. 858కోట్ల అంచనా వ్యయం ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 609 కోట్ల పనులకుగాను రూ. 267.07 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధంచేసి టెండర్లను ఆహ్వానించారు. మిగిలిన ఫ్యాకేజీలకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

