హైదరాబాద్ : అక్రమ మార్గంలో డబ్బు సంపాధించడానికి ఆడ, మగ తేడా లేకుండా పోయింది. ఈజీ మనీ వస్తుందంటే చాలు అడ్డదారుల్లో నడవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. నిషేధిత గంజాయిని(Ganja) విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను ఎక్సైజ్, ఎస్టీఎఫ్ పోలీసులు(Women arrested) పట్టుకున్నారు. అయిదుగురు మహిళల వద్ద 11.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులుతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లోయర్ దూల్పేట్లోని జుంగూర్ బస్తలో కమలా బాయి అనే మహిళ అమ్మకాలు సాగిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఐదుగురు మహిళల వద్ద మొత్తంగా 11.3 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో కమలాబాయి, దుర్గా సింగ్, దివ్య సింగ్ దీక్ష సింగ్ నేహా సింగ్ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా గంజాయి అమ్మినా, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.