బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 17 : హిమాలయ పర్వతాల పై ఉన్న అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. ఇందుకోసం దరఖాస్తుతో పాటు రక్త పరీక్షలు, చాతి ఎక్స్ రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్ లను తీసుకుని రావాలని, 50 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లు తప్పనిసరిగా రెండు మోకాళ్ల ఎక్సరేలను తీసుకొని రావాలని అధికారులు తెలిపారు.
సర్టిఫికెట్ల జారీ కోసం డీఎం నియమించిన వైద్యులు డాక్టర్ బి.కిరణ్ (ఆర్థోపెడిక్), డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి (కార్డియాలజీ), డాక్టర్ భానుప్రియ (పల్మానాలజీ), డాక్టర్ కృష్ణ నాయక్ (జనరల్ మెడిసిన్) వైద్యుల బృందం నియమించారని తెలిపారు. సర్టిఫికెట్ల జారీ పూర్తిగా ఉచితమని అధికారులు పేర్కొన్నారు.