అబిడ్స్, జూన్ 7: మృగశిర కార్తెను పురస్కరించుకొని సోమవారం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కాగా, చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. బ్యారికేడ్లలో సేద తీరారు. ప్రజలకు ఉచితంగా అల్పాహారం, అన్నదానం చేపట్టేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కౌంటర్లను ఏర్పాటు చేశాయి.