సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శని, ఆదివారం చేప ప్రసాదం పంపిణీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 9, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 7, జేబీఎస్ నుంచి 9, ఎంజీబీఎస్ నుంచి 9, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ నుంచి 9, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 7, దిల్సుక్నగర్ నుంచి 7, ఎన్జీవోస్కాలనీ నుంచి 7, మిథాని నుంచి 7, ఉప్పల్ నుంచి 7, చార్మినార్, గోల్కొండ, రాంనగర్ నుంచి 15, రాజేంద్రనగర్ నుంచి 7, రిసాల బజార్ నుంచి 5, ఈసీఐఎల్ నుంచి 5, పటాన్చెరు నుంచి 5, జీడిమెట్ల నుంచి 5, కేపీహెచ్బీ కాలనీ నుంచి 5, గచ్చిబౌలి నుంచి 5 ప్రత్యేక బస్సు సర్వీసులను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు నడిపిస్తున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.