సిటీబ్యూరో: గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష మొదటిరోజు సోమవారం ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
హైదరాబాద్ జిల్లాలో 87.23 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. కాగా, పరీక్షా కేంద్రాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు.