మెహిదీపట్నం, జూలై 13: నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్‌హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు.. ఫైర్‌స్టేషన్ సిబ్బందిని పిలిపించారు. ఫైర్ ఆఫీసర్ దత్తు తన సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని బయటకు తీశారు. వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, తన పేరు నర్సింహ అని మాత్రమే చెప్పాడని, అతడిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించినట్లు దత్తు తెలిపారు.