Fire Department | అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫైర్ శాఖ తనిఖీలు
Fire Department | సికింద్రాబాద్ పరిధిలోని చంద్రలోక్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని చంద్రలోక్ కాంప్లెక్స్ ( Chandralok Complex )లో శుక్రవారం అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫైర్ శాఖ అధికారులు ( Fire Department ) తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన కాంప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ ఫైర్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ నేతృత్వంలో అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ రెడ్డి , స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ తన సిబ్బందితోకలిసి తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా భవనంలో అగ్నిమాపక భద్రతకు సంబంధించిన కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, భవనం నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
భవనంలోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా పాతబడిపోయి ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటకు రావడానికి అవసరమైన వెడల్పు మెట్లు లేవని, భవనం చుట్టూ అవసరమైన సెట్‌బ్యాక్ స్థలం లేదని వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా భవన నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

